మెడికల్ విద్యార్థులకు ఫీజు చెక్కుల పంపిణీ
మెడికల్ విద్యార్థులకు ఫీజు చెక్కుల పంపిణీ
- కేటీఆర్ చేతుల మీదుగా ఆర్థిక సహాయం
- పేద విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
- బీఎల్‌ఆర్ ట్రస్ట్ ద్వారా 16 మంది విద్యార్థులకు మద్దతు
హైదరాబాద్, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): పేద విద్యార్థుల ఉన్నత చదువులకు భరోసా కల్పించే ఉద్దేశంతో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మరోసారి సేవా కార్యక్రమం నిర్వహించారు. బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన 16 మంది వైద్య విద్యార్థులకు వారి విద్యా సంవత్సరం ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని విద్యార్థులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులు వైద్యులుగా ఎదగాలని ఆకాంక్షించారు. సమాజానికి ఉపయోగపడేలా విద్యను అభ్యసించాలని సూచించారు. రాజకీయాలకే పరిమితం కాకుండా సమాజంలోని పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సేవా దృక్పథాన్ని ఆయన అభినందించారు.
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే బీఎల్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతరం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వైద్య విద్య అభ్యసించే విద్యార్థులకు ఫీజుల భారం తగ్గేలా ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్య విద్యార్థులు మరియు వారి కుటుంబ సభ్యులు తమ చదువుకు అండగా నిలిచిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మంచి వైద్యులుగా మారి సమాజానికి సేవ చేస్తామని వారు పేర్కొన్నారు.
