రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మహిళా దినోత్సవం సందర్భంగా కరాటే శిక్షణ కార్యక్రమం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మహిళా దినోత్సవం సందర్భంగా కరాటే శిక్షణ కార్యక్రమం

  • - శ్రీకాకుళం ఉమెన్ కాలేజీలో డిఫెన్స్ టెక్నిక్స్ శిక్షణ
  • - మహిళలు ఆత్మరక్షణలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచన
  • - మహిళల భద్రతకు పోలీసులు కట్టుబడి ఉన్నట్లు ప్రకటన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

శ్రీకాకుళం, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్):
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డిఫెన్స్ టెక్నిక్స్ అండ్ కరాటే శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం శ్రీకాకుళం ఉమెన్ కాలేజీలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నారిమణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి అదనపు ఎస్పీ కె.వి. రమణ, డీఎస్పీ వివేకానంద, పోక్సో కోర్ట్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాలాక్షి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ కె.వి. రమణ మాట్లాడుతూ మహిళలు ఆత్మరక్షణలో నైపుణ్యాలు అభ్యసించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఎలాంటి అపాయకర పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం పెంపొందుతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం పోలీసులు కట్టుబడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ విద్యతో పాటు స్వీయ రక్షణ శిక్షణ కూడా ప్రతి యువతికి అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్వొకేట్ పొట్టునూరు పద్మ, హ్యూమన్ రైట్స్ సభ్యులు మణిశర్మ, డాక్టర్ తంగి సౌజన్య, జేసీఐ ప్రెసిడెంట్ టీ. ఉషారాణి, యోగ ప్రెసిడెంట్ తంగి స్వాతి, ఎస్‌.ఐలు లక్ష్మి, చంద్రకళ, లావణ్య, ఏ‌.ఎస్‌.ఐలు అరుణ కుమారి, రేణుక తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-