రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

చిత్తూరులో కాల్పుల కలకలం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

చిత్తూరులో కాల్పుల కలకలం

- పేకాటలో బాకీ వివాదం రక్తపాతం

- యువకుడిని నాటు తుపాకీతో కాల్చి హత్య

- ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు

చిత్తూరు, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్): చిత్తూరు జిల్లాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. పేకాట ఆడుతున్న సమయంలో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు బాకీ విషయంలో తలెత్తిన ఘర్షణ చివరకు హత్యకు దారితీసింది.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చిత్తూరు రూరల్ మండలంలోని తుమ్మిందపాల్యం గ్రామానికి చెందిన యువకులు కలిసి పేకాట ఆడుతుండగా రూ.2 లక్షల బాకీ విషయంపై వాగ్వాదం జరిగింది. బాకీ ఎప్పుడు చెల్లిస్తావని అడగడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఢిల్లీ బాబు (26) అనే యువకుడు కోపంతో నాటు తుపాకీతో సాయికుమార్ (24) అనే యువకుడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యకు పాల్పడిన ఢిల్లీ బాబును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో తుమ్మిందపాల్యం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Comments

-Advertisement-