బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
బాలికల పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి
- మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థినులతో కలిసి భోజనం
- నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచనలు
- పాఠశాల సౌకర్యాలపై సమగ్రంగా పరిశీలన
హుస్నాబాద్, 9 మార్చి (పీపుల్స్ మోటివేషన్): హుస్నాబాద్ మండల కేంద్రంలోని సామాజిక సంక్షేమ వసతి గృహ బాలికల పాఠశాలలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సోమవారం మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలను సందర్శించిన ఆయన, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థినులకు భోజనం వడ్డిస్తున్నారా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లేట్ తీసుకొని క్యూ లైన్‌లో నిలబడి భోజనం వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న వంట సిబ్బందితో మంత్రి మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. ఆహారం విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయకు సూచించారు.
అలాగే పాఠశాల తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి తాగునీటి ట్యాంకులను కూడా తనిఖీ చేశారు. పాఠశాలలో అవసరమైన నిర్వహణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థినుల సౌకర్యాల కోసం మరుగుదొడ్లు మరియు అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో పదవ తరగతి విద్యార్థినులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. ఇతర తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాల పునర్విమర్శ చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమం సందర్భంగా విద్యార్థినులు పాటలు పాడి, కథలు చెప్పగా మంత్రి వారిని అభినందించి సత్కరించారు.
Comments
