రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఆర్టీసీ బస్సు–కారు ఢీకొన్న ఘోర ప్రమాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఆర్టీసీ బస్సు–కారు ఢీకొన్న ఘోర ప్రమాదం

ఇద్దరు అన్నలు, చెల్లెలు మృతి

కల్యాణదుర్గం సమీపంలో విషాదం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

అనంతపురం, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్):
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గుబనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు, కారు బలంగా ఢీకొనడంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం నుంచి రాయదుర్గం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి కల్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను కర్ణాటక రాష్ట్రంలోని ముదిగల ప్రాంతానికి చెందిన చంద్రకళ (32), ఆమె సోదరులు శివకుమార్ (36), హనుమంత రాయుడు (40)గా గుర్తించారు. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.

Comments

-Advertisement-