అమరావతిలో హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అమరావతిలో హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన
న్యాయమూర్తుల నివాస సముదాయాల ప్రారంభం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి పాల్గొన్నారు
అమరావతి, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్): ఏపీ రాజధాని అమరావతిలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది. నూతనంగా నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అతిథి గృహానికి శంకుస్థాపన చేయడంతో పాటు, హైకోర్టు న్యాయమూర్తుల కోసం నిర్మించిన నివాస సముదాయాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మరియు ఇతర గౌరవ న్యాయమూర్తులు కూడా హాజరయ్యారు. న్యాయమూర్తుల కోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నివాస సముదాయాలను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించారు. అనంతరం హైకోర్టు అతిథి గృహ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. రాజధానిలో న్యాయవ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. న్యాయమూర్తులకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చడం ప్రభుత్వ ప్రాధాన్యతగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని అమరావతికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు వర్గాల నుంచి ఘన స్వాగతం లభించింది. రాజధానిలో న్యాయ మౌలిక వసతుల విస్తరణకు ఈ కార్యక్రమాలు మైలురాయిగా నిలిచాయి.
Comments

