గుడివాడలో శాంతిభద్రతలపై సమీక్ష
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
గుడివాడలో శాంతిభద్రతలపై సమీక్ష
- పోలీస్ అధికారులతో కీలక భేటీ
- గంజాయి నియంత్రణపై ప్రశంస
- ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సూచనలు
గుడివాడ, మార్చి 3 (పీపుల్స్ మోటివేషన్): గుడివాడలో శాంతి భద్రతల పరిరక్షణపై ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజావేదిక కార్యాలయంలో నియోజకవర్గ పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. సీఐలు సోమేశ్వరరావు, శ్రీనివాస్, హనీష్‌లతో కలిసి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. గంజాయి నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న కఠిన చర్యలను ఆయన అభినందించారు. అసాంఘిక శక్తులు, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండకూడదని స్పష్టం చేశారు. పట్టణంలో శాంతి భద్రతలు కాపాడటం అందరి సామూహిక బాధ్యత అని పేర్కొన్నారు. రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన గుర్తుచేశారు. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడకుండా అవసరమైన చోట ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.
గుడివాడలో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందిస్తానని రాము తెలిపారు. చట్టం, క్రమశిక్షణ, భద్రతలే అభివృద్ధికి పునాది అని, ప్రజలు నిస్సంకోచంగా జీవించే గుడివాడ నిర్మాణమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
Comments
