రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రైల్ భవన్‌లో రామ్మోహన్ నాయుడు–అశ్విని వైష్ణవ్ భేటీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రైల్ భవన్‌లో రామ్మోహన్ నాయుడు–అశ్విని వైష్ణవ్ భేటీ

  • సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలపై చర్చ
  • శ్రీకాకుళం రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతం
  • ఎయిర్–రైల్ అనుసంధానంపై ప్రతిపాదనలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, మార్చి 3 (పీపుల్స్ మోటివేషన్):
న్యూఢిల్లీ రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కింజరాపు భేటీ అయ్యారు. ధోలేరా అంతర్జాతీయ విమానాశ్రయం పురోగతి, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రారంభంపై చర్చించినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు నడపడం, మందస రోడ్, పాతపట్నం, హరిశ్చంద్రపురం స్టేషన్లలో కీలక నిలుపుదలలు కల్పించడం, కామేశ్వరీపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి, హరిశ్చంద్రపురం స్టేషన్‌ను లాజిస్టిక్స్ కేంద్రంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై ప్రతిపాదనలు సమర్పించినట్లు చెప్పారు. కొత్త రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌లు, అండర్ బ్రిడ్జ్‌లు నిర్మించడం, స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలపై కూడా చర్చ జరిగింది. మంత్రి గారితో కలిసి కంట్రోల్ రూమ్‌లో పనితీరును సమీక్షించి, ప్రయాణికుల భద్రతకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. ధోలేరా అభివృద్ధికి అనుగుణంగా రైల్వే మౌలిక వసతులను సమన్వయం చేస్తూ, భవిష్యత్ విస్తరణకు అనుకూలంగా ఎయిర్–రైల్ అనుసంధానంపై కూడా చర్చించామని పేర్కొన్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సమగ్ర మల్టీ-మోడల్ కనెక్టివిటీ ద్వారా దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-