రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

విలువల విద్యకు ప్రాధాన్యం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

విలువల విద్యకు ప్రాధాన్యం

  • కుప్పంలో భువనేశ్వరి సందేశం
  • విలువల బడి కార్యక్రమంలో పాల్గొన్న భువనేశ్వరి
  • మోరల్ సైన్స్ పాఠ్యాంశంలో చేర్చాలని సూచన
  • విద్యార్థులకు క్రమశిక్షణ, విలువలపై దిశానిర్దేశం

అమరావతి, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్): కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా పైపాళ్యం గ్రామంలో నిర్వహించిన విలువల బడి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మమేకమై వారి చదువులు, అభిరుచులపై తెలుసుకుంటూ వారికి ప్రేరణనిచ్చారు. విద్యార్థులను చూసినప్పుడల్లా తన చిన్ననాటి విద్యాభ్యాసం గుర్తుకు వస్తుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా మోరల్ సైన్స్ వంటి విలువల ఆధారిత పాఠ్యాంశాలను మళ్లీ విద్యా విధానంలో చేర్చాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడంలో ఇటువంటి పాఠ్యాంశాలు కీలకమని పేర్కొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఇప్పటి కాలంలో సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, టీవీలు, సోషల్ మీడియా వంటి వాటి ప్రభావం ఎక్కువగా ఉందని, విద్యార్థులు వీటికి దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. తమ చిన్నతనంలో ఈ సాంకేతిక వసతులు లేకపోవడం వల్ల కుటుంబంతో కలిసి సంతోషంగా గడిపిన రోజులను గుర్తుచేసుకున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, జీవితం లో విజయం సాధించాలంటే నియమాలను పాటించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉండే ఆనందం, పరస్పర సహకారం గురించి కూడా వారికి అవగాహన కల్పించారు. మొత్తంగా విలువలతో కూడిన విద్యే మంచి సమాజ నిర్మాణానికి పునాది అని భువనేశ్వరి స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు మంచి విలువలను అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారని తెలిపారు.

Comments

-Advertisement-