రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి

- 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం

- అధికారులతో కలెక్టర్ సమీక్ష

- మిషన్ మోడ్‌లో నిర్వహించాలని ఆదేశం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

జనగామ, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించనున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు మిషన్ మోడ్‌లో అమలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీడీఓలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. కార్యక్రమం అమలుకు సంబంధించిన అంశాలపై అధికారులతో చర్చించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కింద చేపట్టాల్సిన పనులపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించి కలెక్టర్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. కార్యక్రమం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, నిర్దేశించిన లక్ష్యాలను సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

-Advertisement-