రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

‘తెలుగునాడు’ వ్యాఖ్యలపై దుమారం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

‘తెలుగునాడు’ వ్యాఖ్యలపై దుమారం

  1. గరికపాటి వ్యాఖ్యలతో చర్చనీయాంశం
  2. పేరు మార్పు అవసరం లేదన్న కమలానంద భారతి
  3. ఆంధ్రప్రదేశ్ పేరుపై సెంటిమెంట్ ప్రస్తావన

అమరావతి, మార్చి 2 (పీపుల్స్ మోటివేషన్): ఆంధ్రప్రదేశ్‌ను ‘తెలుగునాడు’గా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చనీయాంశమయ్యాయి. తెలుగు ప్రజల బతుకులు మారాలంటే రాష్ట్రానికి తెలుగుదనం ప్రతిబింబించే పేరు అవసరమని, గతంలో ఎన్టీఆర్ కూడా తెలుగునాడు కోసం ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అనే పేరులో తెలుగుదనం కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పేరు మార్చాల్సిన అవసరం లేదని, ప్రజల విశ్వాసాలు, సెంటిమెంట్లను పరిగణనలోకి తీసుకోకుండా ఇలాంటి సూచనలు చేయడం సరైంది కాదన్నారు. ‘నాడు’ అనే పదం తమిళ భాషకు చెందినదికాదా? ఆంధ్ర, ప్రదేశ్ రెండు సంస్కృత పదాలేనని ఆమె వివరించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రామాయణ కాలం నుంచే ‘ఆంధ్ర’ అనే పేరు ఉందని, పేరు మార్పుతో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాదని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ ఆంధ్రుల ఆత్మగౌరవ నినాదాన్ని ముందుకు తెచ్చినా, పార్టీకి ‘తెలుగుదేశం’ అని పేరు పెట్టారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయవద్దని గరికపాటికి సూచించారు. మా ప్రాంతం, మా జీవన విధానం ఎలా ఉండాలో మాకు తెలుసని, బయట ప్రాంతాల్లో ఉండి సలహాలు ఇవ్వడం అవసరం లేదని కమలానంద భారతి అన్నారు. తాము ఆంధ్రప్రదేశ్ ప్రజలుగానే కొనసాగుతామని స్పష్టం చేశారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీసింది.

Comments

-Advertisement-