రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

హోలీ ప్రశాంతంగా జరుపుకోండి: సజ్జనర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

హోలీ ప్రశాంతంగా జరుపుకోండి: సజ్జనర్

  • విజిబుల్ పోలీసింగ్‌కు ఆదేశాలు
  • బలవంతపు రంగులకు కఠిన చర్యలు
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాల మూసివేత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 2 (పీపుల్స్ మోటివేషన్):
నగరంలో హోలీ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనర్ సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ నుంచి సోమవారం పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పండుగ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బ్లూ కోట్స్, పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ కాయాలని చెప్పారు. ఇష్టం లేని వారిపై బలవంతంగా రంగులు పూస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో పాదచారులు, వాహనాలపై రంగులు చల్లవద్దని, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై నగరవ్యాప్తంగా మఫ్టీలో షీ టీమ్స్ నిఘా ఉంటుందని తెలిపారు. ప్రజలు రసాయన రంగులకు బదులు సహజసిద్ధమైన రంగులు వాడాలని సూచించారు. వేడుకల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పేర్కొన్నారు. రోడ్లపై యువకులు గుంపులుగా తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లింల ప్రార్థనలకు ఆటంకం కలగకుండా చూడాలని, పీస్ కమిటీల సమన్వయంతో పోలీసులు పనిచేయాలని ఆదేశించారు.

హోలీ సందర్భంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిటీ పోలీస్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తితే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని, పోలీసులకు సహకరించి పండుగను సంతోషంగా జరుపుకోవాలని నగర ప్రజలను కోరారు.

Comments

-Advertisement-