కానూరులో ఉద్రిక్తత
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కానూరులో ఉద్రిక్తత
- ఇంటి కూల్చివేతకు ప్రయత్నించిన అధికారులు
- యజమాని ప్రతిఘటనతో ఉద్రిక్త పరిస్థితి
- పట్టా అందజేసి కూల్చివేత నిలిపివేత
పెనమలూరు, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్) : పెనమలూరు నియోజకవర్గ పరిధిలోని కానూరు ఎస్సీ కాలనీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ ఓ ఇంటిని జేసీబీతో కూల్చివేయడానికి అధికారులు ప్రయత్నించగా యజమాని తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సంఘటనతో స్థానికంగా కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. బాధిత కుటుంబానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ కూల్చివేత చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమయంలో అక్కడికి స్థానిక ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అధికారులు కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం బాధిత కుటుంబానికి వెంటనే ఇంటి పట్టా అందజేశారు. దీంతో అక్కడి పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
