రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గూడూరులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గూడూరులో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

  • జెండా ఆవిష్కరణతో వేడుకల ప్రారంభం
  • వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు
  • జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కొనియాడిన మెరిగ మురళీధర్

గూడూరు, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్) : నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం గూడూరు సనత్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గ ఇంచార్జి మెరిగ మురళీధర్ పార్టీ శ్రేణులతో కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ స్థాపన దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలుచోట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలను నిర్వహించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు బడుగు, బలహీన వర్గాలు మరియు పేద ప్రజలకు ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు సహకరిస్తున్న నాయకులు, మహిళలు, యువత మరియు కార్యకర్తలకు ఎమ్మెల్సీ మెరిగ మురళీధర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలను అందరూ కలసి విజయవంతం చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ మరియు గూడూరు మండల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

-Advertisement-