రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

లోక్‌సభలో రాహుల్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

లోక్‌సభలో రాహుల్‌కు మద్దతుగా ప్రియాంక గాంధీ

స్పీకర్‌పై అవిశ్వాస తీర్మాన చర్చలో వ్యాఖ్యలు

బీజేపీ ప్రభుత్వానికి తలవంచని నాయకుడు రాహుల్ అని ప్రశంస

అధికార పక్షంపై ప్రియాంక విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తన సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి గట్టిగా మద్దతు తెలిపారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి తలవంచకుండా నిలబడిన ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ప్రియాంక కొనియాడారు. ప్యానెల్ స్పీకర్ కృష్ణ ప్రసాద్ తెన్నేటి అనుమతితో సభలో మాట్లాడిన ప్రియాంక గాంధీ అధికార పక్షంపై విమర్శలు చేశారు. ప్రతిరోజూ నెహ్రూజీని విమర్శించే వారు ఇప్పుడు ఆయనను ఉటంకించడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన నాయకుడు నెహ్రూజీ అని ఇప్పుడు చెప్పడం చూస్తే ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యులు బల్లలు చరుస్తూ మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీని సమర్థిస్తూ గత 12 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి తలవంచని నాయకుడు ఈ దేశంలో ఒక్కరే ఉన్నారని, ఆయనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అని ప్రియాంక పేర్కొన్నారు. లోక్‌సభలో నిజం మాట్లాడటానికి ఆయన వెనుకాడరని, కానీ ప్రభుత్వం ఆ నిజాన్ని అంగీకరించలేకపోతుందని విమర్శించారు. ఇదిలా ఉండగా స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు కూడా స్పందించారు. రాజ్యాంగం ప్రకారం చట్టాలు, నిబంధనలకు అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఎవరైనా తమను తాము నిబంధనలకు అతీతంగా భావిస్తే వారిని నిలదీయడం అవసరమని పరోక్షంగా రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు చేశారు.

Comments

-Advertisement-