రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మేడారం జాతరలో పరిచయం.. హోంగార్డు రెండో వివాహం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మేడారం జాతరలో పరిచయం.. హోంగార్డు రెండో వివాహం

  • ట్రాఫిక్ విధుల్లో ఉన్నప్పుడు యువతితో పరిచయం
  • మొదటి భార్యకు తెలియకుండా ఆలయంలో వివాహం
  • రక్షణ కోసం బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించిన జంట

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
మేడారం జాతరకు విధులపై వెళ్లిన ట్రాఫిక్ హోంగార్డు ఒక యువతితో పరిచయం పెంచుకుని ఆమెను వివాహం చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నప్పటికీ హోంగార్డు రెండో పెళ్లి చేసుకున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లాకు చెందిన పొంగూరు వాసుదేవరావు (38) అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇప్పటికే వివాహం అయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల అతని భార్య ఇద్దరు కూతుళ్లను తీసుకుని స్వగ్రామానికి వెళ్లగా, వాసుదేవరావు తన ఏడేళ్ల కుమారుడితో జగద్గిరిగుట్టలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మేడారం జాతర సందర్భంగా ట్రాఫిక్ విధులపై వెళ్లిన సమయంలో ఒక యువతి అతని వద్దకు వచ్చింది. జాతర సమయంలో తన తల్లి కనిపించడం లేదని చెబుతూ ఆ యువతి వాసుదేవరావు కూర్చున్న ట్రాఫిక్ బూత్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. వాసుదేవరావు ప్రయత్నంతో గంట వ్యవధిలోనే ఆమె తల్లిని గుర్తించి అప్పగించాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి క్రమంగా ప్రేమగా మారింది. దీంతో గత నెల 25వ తేదీన అమీర్‌పేట్‌లోని కనకదుర్గ అమ్మవారి ఆలయంలో మొదటి భార్యకు తెలియకుండా వాసుదేవరావు యువతిని వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల యువతి తరచూ బయటకు వెళ్తుండటాన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు ఆరా తీయగా హోంగార్డుతో వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో తమకు రక్షణ కల్పించాలని కోరుతూ వాసుదేవరావు తనతో వివాహం చేసుకున్న యువతిని తీసుకుని బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై వివరాలు తెలుసుకున్న పోలీసులు యువతి మేజర్ కావడంతో ఆమెను హోంగార్డుతో వెళ్లేందుకు అనుమతించినట్లు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై మొదటి భార్య నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు వెల్లడించారు.

Comments

-Advertisement-