రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

డెలావర్ గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

డెలావర్ గవర్నర్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

  • విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలపై చర్చ
  • తెలంగాణ–డెలావర్ ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి
  • గవర్నర్‌కు తెలంగాణ రైజింగ్–2047 విజన్ పత్రం అందజేత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అమెరికా దేశానికి చెందిన డెలావర్ రాష్ట్ర గవర్నర్ మాట్ మేయర్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలు, డేటా భద్రత, యూనివర్సల్ హెల్త్ కేర్ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాల మధ్య సహకారం పెంపు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నారు. సమావేశంలో డెలావర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి గవర్నర్ మాట్ మేయర్ ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి ప్రజల కోసం అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాలు, రుణమాఫీ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ పథకాల అమలు విధానం గురించి కూడా ఆయన వివరించినట్లు సమాచారం. తెలంగాణ మరియు డెలావర్ రాష్ట్రాల మధ్య భవిష్యత్తులో మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రతినిధుల బృందంతో అధికారిక పర్యటనకు డెలావర్ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డెలావర్ గవర్నర్‌కు తెలంగాణ రైజింగ్–2047 విజన్ పత్రాన్ని అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలను ఈ విజన్ పత్రంలో వివరించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, డెలావర్ ఫస్ట్ లేడీ లారెన్ మేయర్, వేం నరేందర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-