రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కొండపల్లి ఐడీఏలో డ్రగ్స్ పట్టివేత

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కొండపల్లి ఐడీఏలో డ్రగ్స్ పట్టివేత

  • 200 కిలోల ఆల్ఫ్రాజోలంను స్వాధీనం
  • రూ.47 కోట్ల విలువైన మత్తు పదార్థం గుర్తింపు
  • ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు

విజయవాడ, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని కొండపల్లి ఐడీఏలో నార్కోటిక్ ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒక కంపెనీలో భారీగా మత్తు పదార్థాన్ని గుర్తించారు. సుమారు 200 కిలోల ఆల్ఫ్రాజోలంను అధికారులు స్వాధీనం చేసుకుని కంపెనీని సీజ్ చేశారు. అధికారుల అంచనా ప్రకారం స్వాధీనం చేసుకున్న ఆల్ఫ్రాజోలంని మార్కెట్ విలువ దాదాపు రూ.47 కోట్లకు పైగా ఉంటుంది. డ్రగ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు కూడా భారీగా లభించాయి. సుమారు 800 కిలోల ముడి పదార్థాలు, 2,860 లీటర్ల రసాయనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తనిఖీల సమయంలో ఫ్యాక్టరీలో రియాక్టర్, డ్రైయర్, సెంట్రిఫ్యూజ్ వంటి పారిశ్రామిక యంత్రాలను కూడా గుర్తించారు. డ్రగ్ తయారీకి ఈ యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న నెట్వర్క్ ఈ అక్రమ కార్యకలాపాల వెనుక ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. కెమికల్ ఫ్యాక్టరీని అద్దెకు తీసుకుని మత్తు పదార్థాల తయారీ కొనసాగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. డ్రగ్స్ రాకెట్ వెనుక ఉన్న ప్రధాన నిందితులను గుర్తించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Comments

-Advertisement-