రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

కూకట్‌పల్లి నల్ల చెరువు ప్రారంభానికి ఏర్పాట్లు

  • అభివృద్ధి పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
  • మొక్కల నాటకం, పార్కుల అభివృద్ధికి సూచనలు
  • త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్):
కూకట్‌పల్లిలోని నల్ల చెరువు ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అధికారులను ఆదేశించారు. మార్చి 6 తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ చెరువును ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో కమిషనర్ బుధవారం నల్ల చెరువును సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. హైడ్రా చేపట్టిన మొదటి విడతలో ఆరు చెరువుల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి ప్రారంభించగా, నాలుగు ఐదు రోజుల్లో పాతబస్తీలోని బమ్రుఖనుద్దౌలా చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో చెరువు పరిసరాల అభివృద్ధి, సౌకర్యాలపై సమీక్ష నిర్వహించారు. చెరువు చుట్టూ పెద్ద మొత్తంలో నీడనిచ్చే మొక్కలు నాటాలని, పార్కులను అభివృద్ధి చేయాలని కమిషనర్ సూచించారు. మురుగు నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు విషయమై జలమండలి అధికారులతో కూడా చర్చించారు. ప్రజలు సేదతీరేందుకు వాకింగ్ ట్రాక్‌లు, పిల్లల ఆట స్థలాలు, ఓపెన్ జిమ్‌లను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ చెరువు అభివృద్ధి పనులు ప్రారంభించినప్పుడు విమర్శలు వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అధికారులు తెలిపారు. వాకింగ్, వినోదం కోసం ఐదారు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నారని పేర్కొన్నారు. చెరువు అభివృద్ధితో వరదల సమస్య తగ్గడమే కాకుండా భూగర్భ జలాల స్థాయి కూడా పెరుగుతుందని అధికారులు తెలిపారు.

Comments

-Advertisement-