రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బాచుపల్లిలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఈటల రాజేందర్

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బాచుపల్లిలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఈటల రాజేందర్

  • బాధితులను పరామర్శించిన ఎంపీ
  • కరెంటు తీగల వల్లే ప్రమాదమని అనుమానం
  • సహాయం అందిస్తామని హామీ

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 4 (పీపుల్స్ మోటివేషన్):
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని బాచుపల్లిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని ఎంపీ ఈటల రాజేందర్ సందర్శించారు. బాధితులతో మాట్లాడి సంఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రగతి నగర్, బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల నుంచి సుమారు 20 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం వచ్చిన కుటుంబాలు ఫర్నిచర్ వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. షాపుల వద్దే నివసిస్తూ జీవనం సాగిస్తున్న వారందరి సంపాదన ఒక్కసారిగా అగ్నికి ఆహుతైందని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లైన్ తెగిపడటం వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రెండు దశాబ్దాలుగా కష్టపడి సంపాదించిన సర్వం కళ్లముందే కాలిపోవడం హృదయవిదారకమని పేర్కొన్నారు. బాధితులు కట్టుబట్టలతో మిగిలిపోయారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి తమ వంతు సహాయం అందించి, వారు మళ్లీ వ్యాపారం ప్రారంభించేలా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో అనేక చోట్ల కరెంటు తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. బిల్డింగ్ పై నిలబడితే చేతికి అందేలా విద్యుత్ తీగలు ఉన్నాయని, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ అమలు చేయాలని, ట్రాన్స్‌ఫార్మర్‌ల చుట్టూ సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

Comments

-Advertisement-