రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

సీబీఎస్సీ కీలక నిర్ణయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

సీబీఎస్సీ కీలక నిర్ణయం

  • పశ్చిమాసియా దేశాల్లో 12వ తరగతి పరీక్షలు రద్దు
  • యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం
  • కొత్త తేదీలను త్వరలో ప్రకటించనున్న బోర్డు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సీబీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16 నుంచి జరగాల్సిన 12వ తరగతి బోర్డు పరీక్షలను ఆ ప్రాంతంలోని పలు దేశాల్లో పూర్తిగా రద్దు చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పశ్చిమాసియా దేశాల్లో భద్రతా పరిస్థితులు అనిశ్చితంగా మారాయి. ఈ నేపథ్యంలో బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో నిర్వహించాల్సిన 12వ తరగతి పరీక్షలను సీబీఎస్సీ రద్దు చేసింది. ఈ దేశాల్లో ఉన్న 150కు పైగా సీబీఎస్సీ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగాల్సిన మిగిలిన అన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు సర్క్యులర్‌లో పేర్కొంది. ఫలితాల ప్రకటనకు సంబంధించిన విధానాన్ని త్వరలో ప్రత్యేకంగా వెల్లడిస్తామని సీబీఎస్సీ పరీక్షల నియంత్రణ అధికారి సంయమ్ భరద్వాజ్ తెలిపారు. ఇప్పటికే ఫిబ్రవరి 17 నుంచి 28 వరకు జరిగిన పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, తరువాత ప్రారంభమైన యుద్ధ పరిస్థితుల కారణంగా మార్చి 1 నుంచి జరగాల్సిన పరీక్షలను పలు దఫాలుగా వాయిదా వేసిన తర్వాత చివరకు రద్దు చేయాలని నిర్ణయించినట్లు బోర్డు వెల్లడించింది.

Comments

-Advertisement-