తిరుపతిలో సచివాలయ సిబ్బందిపై దాడి
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
తిరుపతిలో సచివాలయ సిబ్బందిపై దాడి
- ప్రాపర్టీ టాక్స్ వివాదం ఉద్రిక్తతకు దారి
- సి.ఎన్. ప్రింటర్స్ వద్ద ఘర్షణ
- నిరసనకు దిగిన కార్పొరేషన్ సిబ్బంది
తిరుపతి, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్): తిరుపతి ప్రకాశం రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయం అడ్మిన్ సెక్రటరీ నాగార్జునపై సి.ఎన్. ప్రింటర్స్ సిబ్బంది దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది. విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ సిబ్బందిపై జరిగిన ఈ దాడి తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. సమాచారం ప్రకారం ప్రాపర్టీ టాక్స్ చెల్లించాలని సచివాలయం సిబ్బంది కోరడంతో ఈ వివాదం ప్రారంభమైంది. టాక్స్ చెల్లింపుల విషయంపై వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, షాపు నిర్వహకులు సచివాలయం సిబ్బందిపై భౌతిక దాడికి దిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో నాగార్జునకు గాయాలు అయినట్లు సమాచారం. ఈ ఘటనకు నిరసనగా కార్పొరేషన్ సచివాలయం సిబ్బంది సి.ఎన్. ప్రింటర్స్ దుకాణం ముందు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల భద్రతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనపై తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకునే దిశగా విచారణ కొనసాగిస్తున్నారు.
Comments
