ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం
- కంది మండలంలో ప్రత్యేక సమావేశం
- ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ హాజరు
- ప్రజా ప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలపై వివరణ
సంగారెడ్డి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఎల్‌ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డా. సంజీవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పాల్గొన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఇటీవల ఎన్నికైన పురపాలక సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, వార్డ్ సభ్యులు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ప్రజాప్రతినిధులు ప్రభుత్వ కార్యక్రమాలను గ్రామాలు, పట్టణాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
Comments
