కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కేటీఆర్‌ను కలిసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లు
- పని, జీతభత్యాలపై స్పష్టత కోరిన సర్వేయర్లు
- ప్రభుత్వ నిర్ణయాల ఆలస్యంపై ఆవేదన
- సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి
హైదరాబాద్, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): రాష్ట్రవ్యాప్తంగా లైసెన్స్‌డ్ సర్వేయర్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వం అనేక నెలలు గడిచినా పని కేటాయింపు, జీతభత్యాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ధరణి స్థానంలో భూభారతి వ్యవస్థను తీసుకువచ్చినప్పటికీ అందులో భాగంగా ఎంపిక చేసిన లైసెన్స్‌డ్ సర్వేయర్లకు సరైన అవకాశాలు కల్పించడం లేదని వారు పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ప్రతినెల గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం తమకు అన్యాయం జరుగుతోందని వారు తెలిపారు. తమకు లైసెన్స్ పత్రాలు ఇచ్చి నెలలు గడిచినా ఇప్పటివరకు జీతభత్యాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సర్వేయర్లు పేర్కొన్నారు. భూ సర్వే పనులు నిర్వహించే తమకు స్థిరమైన వేతనం లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈ సందర్భంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కేటీఆర్‌ను కోరారు. లైసెన్స్‌డ్ సర్వేయర్లకు పారదర్శకంగా పనులు కేటాయించే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
Comments
