అమరావతిలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి భూమిపూజ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
అమరావతిలో అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి భూమిపూజ
- గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో కొత్త కేంద్రం ఏర్పాటు
- రూ.1.28 కోట్లతో నిర్మాణం చేపట్టనున్న ప్రభుత్వం
- నవంబర్ 2026 నాటికి పనులు పూర్తి లక్ష్యం
అమరావతి, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్): ప్రజారాజధాని అమరావతిలో అగ్నిమాపక సేవలను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు ప్రాంతాల్లో కొత్త అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లోని నేలపాడులో కొత్త అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ పీ.వి. రమణ పాల్గొని భూమిపూజ చేశారు. శాసనసభ, హైకోర్టు వంటి కీలక పరిపాలన భవనాలు నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. సుమారు 50 సెంట్ల స్థలంలో రూ.1.28 కోట్ల అంచనా వ్యయంతో ఈ అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఈ నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చేపడుతోంది. కార్యక్రమంలో గుంటూరు డివిజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి, సీఆర్‌డీఏ డీఎఫ్‌ఓ టి.శ్రీనివాస్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేలపాడులో ఏర్పాటు కానున్న ఈ అగ్నిమాపక కేంద్రాన్ని 2026 నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Comments
