కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో తీన్మార్ మల్లన్న భేటీ
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో తీన్మార్ మల్లన్న భేటీ
- విద్యార్థి సంఘాల వినతిపత్రాల స్వీకరణ
- హాస్టల్, మెస్, ఉద్యోగాల సమస్యల ప్రస్తావన
- సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్సీ హామీ
వరంగల్, 13 మార్చి (పీపుల్స్ మోటివేషన్): కాకతీయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన విద్యార్థులు, ప్రొఫెసర్లు మరియు ఉద్యోగులతో ముఖాముఖి కార్యక్రమంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విద్యార్థి సంఘాల నాయకులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ఆయనకు అందజేశారు.
విద్యార్థి సంఘాల ప్రతినిధులు యూనివర్సిటీలో ఉన్న వివిధ సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా హాస్టల్ సౌకర్యాల లోపం, మెస్ నిర్వహణలో ఉన్న సమస్యలు, విద్యార్థుల ఉపాధి అవకాశాలు వంటి అంశాలను వివరంగా తెలిపారు. వినతిపత్రాలను స్వీకరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విద్యార్థుల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. విద్యార్థులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే ఈ సమస్యలను మండలిలో ప్రస్తావించి ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తానని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే విద్యార్థుల పక్షాన పోరాటం చేయడానికి కూడా వెనుకాడబోనని మల్లన్న స్పష్టం చేశారు.
Comments
