రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

తెలుగు వారి భద్రతపై ముఖ్యమంత్రి ఆందోళన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

తెలుగు వారి భద్రతపై ముఖ్యమంత్రి ఆందోళన

  • దౌత్య కార్యాలయాల సూచనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి
  • కేంద్రంతో సమన్వయం, తరలింపు చర్యలకు ఆదేశాలు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

హైదరాబాద్, మార్చి 1 (పీపుల్స్ మోటివేషన్):
పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న తెలుగు వారంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ముఖ్యంగా ఇరాన్, దుబాయ్ తదితర దేశాల్లో చిక్కుకున్న వారు ఆయా ప్రాంతాల దౌత్య కార్యాలయాలు జారీ చేస్తున్న మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత అత్యవసర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విదేశాల్లో ఉన్న వారి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కోరారు. పరిస్థితులను సమగ్రంగా అంచనా వేసి అవసరమైతే ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.

భారతీయుల రక్షణ, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై దౌత్య కార్యాలయాల ద్వారా సమగ్ర సమాచారం సేకరించాలని, అవసరమైన సహాయక చర్యలను వేగవంతం చేయాలని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు ముఖ్యమంత్రి అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.

Comments

-Advertisement-