రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

నెల్లూరులో మంత్రి నారాయణపై వైఎస్ఆర్‌సీపీ విమర్శలు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

నెల్లూరులో మంత్రి నారాయణపై వైఎస్ఆర్‌సీపీ విమర్శలు

- మినరల్ వాటర్ ప్లాంట్ కూల్చివేతపై ఆగ్రహం

- అవినీతి ఆరోపణలు – కక్ష సాధింపు చర్యలంటూ విమర్శలు

- ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారంటూ మండిపాటు

నెల్లూరు, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్): నెల్లూరు నగరంలో జరుగుతున్న పరిణామాలపై మంత్రి పి. నారాయణపై వైఎస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, నగరంలో ప్రశాంతతను భంగం చేస్తూ విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చివేయడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతోందని మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని 46వ డివిజన్ చిన్నబజార్ పాత కూరగాయల మార్కెట్ సముదాయంలో ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ వేలూరు ఉమామహేష్, వైఎస్ఆర్‌సీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉన్న ఈ ప్లాంట్‌ను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం దుర్మార్గమని విమర్శించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ చర్య కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఎమ్మెల్సీ ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీపై ప్రతీకారంగా మంత్రి నారాయణ ఈ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. నగరంలో ప్రశాంత వాతావరణాన్ని నాశనం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నెల్లూరు నగరపాలక సంస్థలో భారీ స్థాయిలో అవినీతి జరుగుతోందని ఆరోపిస్తూ, తెలుగు దేశం పార్టీ నేతలకు పెద్దఎత్తున కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు. ఈ అవినీతి వ్యవహారాలను సాక్షాలతో బయటపెడతానని హెచ్చరించారు. ప్రజలపై పన్నుల భారం మోపుతూ, పేదలపై ఒత్తిడి పెంచుతున్నారని ఆరోపించారు.

కేవలం ఐదు రూపాయలకు 20 లీటర్ల ఆర్‌ఓ నీటిని అందిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అలాంటి సేవా కార్యక్రమాన్ని అభినందించాల్సింది పోయి కూల్చివేయడం దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు. పార్కు నిర్మాణం పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. నగరంలో జరుగుతున్న ఈ చర్యలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. మంత్రి నారాయణ విధానాలపై ప్రజలు తలలు పట్టుకుంటున్నారని, ఈ పరిస్థితులకు త్వరలోనే ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

-Advertisement-