రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైయస్ఆర్ ఆశయాల సాధనకే కృషి చేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వైయస్ఆర్ ఆశయాల సాధనకే కృషి చేయాలి

- అరకులోయలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

- జెండా ఆవిష్కరణ చేసి వైయస్ఆర్ విగ్రహానికి నివాళులు

- 2029లో మళ్లీ విజయం సాధించేలా కృషి చేయాలి: ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం

అరకులోయ, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్): అరకులోయ కేంద్రంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పార్టీ జెండాను ఆవిష్కరించి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ వైయస్ఆర్ ఆశయాలను సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించారు. 2029లో మళ్లీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా అందరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గడప గడపకు సంక్షేమం, అభివృద్ధి అందించిన ప్రభుత్వం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయలేదని విమర్శించారు. ప్రజలకు చెప్పుకునే పనులు లేక దేవుడిని అడ్డం పెట్టుకుని కాలం గడిపేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి వైయస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అరకులోయ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేగం చాణక్య, పాంగి చిన్నారావు, స్వాభి రామ్ మూర్తి, పాంగి పరశురామ్, తడబారికి సురేష్ కుమార్, కమ్మిడి అశోక్, జన్ని నరసింహమూర్తి, దూరియా ఆనంద్, శెట్టి అప్పాలు, కిల్లో రామన్న, కొర్ర సుమంజలి, విజయ్ పాంగి, రేగం శివరామకృష్ణ, కాపు మాధవరావు, కిల్లో రాజా రమేష్, షేక్ రహీమ్ తుల్ల, గెడ్డం నరసింగరావు, ఎల్బీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-