రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

రోడ్డులో గుంతలో మొక్క నాటి నిరసన

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

రోడ్డులో గుంతలో మొక్క నాటి నిరసన

  • - తిరుపతి రోడ్ల పరిస్థితిపై భూమన అభినయ్ ప్రశ్న
  • - ప్రమాదకరంగా మారిన మాస్టర్ ప్లాన్ రోడ్
  • - రోడ్ల నిర్వహణపై అధికారులకు హెచ్చరిక

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

తిరుపతి, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):
తిరుపతిలో రోడ్ల దుస్థితిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన అభినయ్ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి మంగళం రోడ్, రేణిగుంట రోడ్‌లను కలిపే ప్రధాన మాస్టర్ ప్లాన్ రోడ్‌లో ఏర్పడిన పెద్ద గుంతలో మొక్క నాటి అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ఈ రహదారిపై ఏర్పడిన గుంత కారణంగా ముఖ్యంగా రాత్రి సమయంలో బైక్ రైడర్లు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం సమయంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు సుమారు 21కి పైగా మాస్టర్ ప్లాన్ రోడ్లు, స్లిప్ రోడ్లు అభివృద్ధి చేసినట్లు భూమన అభినయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తిరుపతిలో కొత్త రోడ్లు అభివృద్ధి చేయలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికే ఉన్న రోడ్లను కూడా సరిగా నిర్వహించకపోవడంతో గోతులు ఏర్పడి ప్రజలకు ప్రమాదంగా మారుతున్నాయని అన్నారు. ప్రజలకు ఈ పరిస్థితిని తెలియజేయడానికి గుంతలో మొక్క నాటి నిరసన చేపట్టినట్లు తెలిపారు. గరుడ వారధిపై ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని నిషేధించిన నిర్ణయంపై కూడా ఆయన స్పందించారు. ప్రమాదాలు జరిగాయని నిజమే అయినప్పటికీ ద్విచక్ర వాహనాలను పూర్తిగా నిషేధించడం సరైన పరిష్కారం కాదన్నారు. భద్రతా చర్యలు, రోడ్డు నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. తిరుపతి ప్రజలు మరియు భక్తుల భద్రత అత్యంత ముఖ్యమని భూమన అభినయ్ పేర్కొన్నారు.

Comments

-Advertisement-