పదవీ విరమణ చేసిన హోంగార్డుకు సన్మానం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
పదవీ విరమణ చేసిన హోంగార్డుకు సన్మానం
- జిల్లా పోలీసు కార్యాలయంలో కార్యక్రమం
- ఎస్పీ చేతుల మీదుగా జ్ఞాపిక, ప్రశంస పత్రం
- తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 వేల అందజేత
శ్రీకాకుళం, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్): శ్రీకాకుళం జిల్లా హోంగార్డు యూనిట్‌కు చెందిన పి. శంకర్ రావు పదవీ విరమణ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాజాం పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా సేవలందించిన ఆయనకు జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా శంకర్ రావుకు జ్ఞాపిక, ప్రశంస పత్రం అందజేశారు. అదేవిధంగా తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5 వేల నగదు అందించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని శంకర్ రావుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి హోంగార్డు సేవలను ప్రశంసించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీతో పనిచేసిన శంకర్ రావు పోలీసు శాఖకు ఎంతో సేవలందించారని పేర్కొన్నారు. పదవీ విరమణ అనంతరం ఆయన జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా కొనసాగాలని ఎస్పీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్. శేషాద్రి, కార్యాలయ పరిపాలన అధికారి సి.హెచ్. గోపినాథ్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఇమాన్యూవల్ రాజు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కె.వి. రమణ, కార్యాలయ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
