టోలీచౌకి ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందన
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
టోలీచౌకి ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పందన
- అధికారులతో ఫోన్‌లో సమీక్ష
- రక్షణ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
- గాయపడిన కార్మికులకు తక్షణ చికిత్స
హైదరాబాద్, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్): హైదరాబాద్‌లోని టోలీచౌకి ప్రాంతంలో జరిగిన నిర్మాణ ప్రమాద ఘటనపై రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి స్పందించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఆయన కార్మిక శాఖకు చెందిన అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.
ప్రమాదంలో గాయపడిన కార్మికులకు తక్షణ వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రక్షణ చర్యలను వేగవంతం చేసి బాధితులకు అవసరమైన సహాయం అందించేందుకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే సేకరించాలని కూడా మంత్రి తెలిపారు. ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే అంశంపై సమగ్రంగా విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. గాయపడిన కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై పూర్తి నివేదికను సమర్పించాలని కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి అధికారులను ఆదేశించారు. ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Comments
