రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఉద్యోగులకు డీఏ బకాయిలపై స్పష్టత.. త్వరలో చెల్లింపులు

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఉద్యోగులకు డీఏ బకాయిలపై స్పష్టత.. త్వరలో చెల్లింపులు

  • అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన
  • మూడు డీఏ బకాయిలను క్లియర్ చేయనున్నట్లు హామీ
  • రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపులపై కూడా భరోసా

హైదరాబాద్, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్): తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న డీఏ బకాయిల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మూడు డీఏ బకాయిలను త్వరలోనే చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా బిల్లులను పెండింగ్‌లో ఉంచిందని తెలిపారు. అందులో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలే రూ. 4,571 కోట్ల వరకు ఉన్నాయని వివరించారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ బకాయిలను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

ఉద్యోగుల సమస్యలను మానవతా కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. డీఏ బకాయిల చెల్లింపులతో పాటు రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న ఈ చెల్లింపులను దశలవారీగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. అదేవిధంగా ఉద్యోగుల ఆరోగ్య భద్రత కోసం క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మరిన్ని చర్యలు చేపడతామని వెల్లడించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంత ఊరట కలిగింది. త్వరలోనే డీఏ బకాయిలు విడుదలవుతాయన్న ఆశతో ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.

Comments

-Advertisement-