రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

బీసీ రక్షణ చట్టంపై ముసాయిదా సిద్ధం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

బీసీ రక్షణ చట్టంపై ముసాయిదా సిద్ధం

  • - బీసీలపై దూషణలకు కఠిన చర్యలు తీసుకునేలా ప్రతిపాదనలు
  • - విజయవాడలో మంత్రుల సమక్షంలో కీలక సమావేశం
  • - బీసీ సంఘాల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకునే నిర్ణయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

విజయవాడ, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):
బీసీల సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. విజయవాడ తాడిగడపలోని బీసీ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆధ్వర్యంలో ‘బీసీ రక్షణ చట్టం’ విధివిధానాల రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సహచర మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు పాల్గొనగా, వర్చువల్ ద్వారా మంత్రులు సుభాష్, ఎస్. కొండపల్లి, సత్యకుమార్ పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో పాటు ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలపై కులం లేదా వృత్తి పేరుతో దూషణలు జరిగితే కఠిన చర్యలు తీసుకునేలా బలమైన చట్టాన్ని రూపొందించేందుకు ముసాయిదా సిద్ధం చేసినట్లు తెలిపారు. బీసీల గౌరవాన్ని కాపాడే విధంగా చట్టం ఉండాలని, వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రధాన లక్ష్యమని సమావేశంలో చర్చించారు. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో అమలు కానున్న ఈ చట్టంపై విస్తృత స్థాయిలో చర్చలు జరపాలని నిర్ణయించారు. బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు ఆత్మగౌరవంతో కూడిన రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు. బీసీల హక్కులను కాపాడుతూ వారికి సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

Comments

-Advertisement-