నవాబుపేట గ్రామం ఆదర్శంగా నిలవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
నవాబుపేట గ్రామం ఆదర్శంగా నిలవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
- గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ప్రారంభం
- రక్షిత మంచినీటి సరఫరా పథకం ప్రారంభం
- గ్రామాభివృద్ధికి ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపు
కరీంనగర్, 9 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజల పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామం ఆదర్శ గ్రామంగా నిలవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి కోసం గ్రామస్తులంతా కలిసికట్టుగా పనిచేసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. సోమవారం నవాబుపేట గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాతో కలిసి మంత్రి ప్రారంభించారు. పశువుల ఆరోగ్యం కోసం ఈ టీకాలు ఎంతో అవసరమని, రైతులు వాటిని తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు.
అదే సమయంలో గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని కూడా ప్రారంభించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి గ్రామస్తులంతా ముందుకు రావాలని మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు మంచి విద్య అందించేందుకు పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని కోరారు. గ్రామంలోని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, నవాబుపేట గ్రామ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
Comments
