రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

గడువులోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి 

  1. - కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాలు
  2. - రామగిరి, మంథనిలో విస్తృత పర్యటన
  3. - 15 రోజుల్లో సంగీత పాఠశాల పనులు పూర్తి లక్ష్యం
  4. - పాఠశాలలు, ఆసుపత్రుల పనులపై సమీక్ష

మంథని, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్): రామగిరి మండలం, మంథని పట్టణ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు. శుక్రవారం ఆయన విస్తృతంగా పర్యటించి పలు నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రామగిరి మండలంలోని కేజీబీవీ పాఠశాల, తహసిల్దార్ కార్యాలయం నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. మంథని పట్టణంలో సంగీత పాఠశాల, మున్సిపల్ కార్యాలయం, జూనియర్ బాలుర పాఠశాల, గురుకుల కళాశాలలో జరుగుతున్న పనులను సమీక్షించారు. షెడ్యూలు కులాల బాలికల వసతి గృహం, ప్రభుత్వ ఆసుపత్రిని కూడా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రామగిరి కేజీబీవీ పాఠశాలలో ఏర్పాటు చేసిన మాడ్యులర్ కిచెన్‌ను కలెక్టర్ ప్రారంభించారు. సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్టీమ్ రైస్ బాయిలర్, ఆటోమేటిక్ రోటీ మేకర్, ఇడ్లీ బాయిలర్, గ్యాస్ లైన్, డైనింగ్ టేబుల్స్‌ను పరిశీలించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, తహసిల్దార్ కార్యాలయ పనులు త్వరగా ప్రారంభించాలని సూచించారు. మంథని సంగీత పాఠశాల అభివృద్ధి పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయ నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలని, జూనియర్ పాఠశాలలో పెండింగ్ పనులను త్వరగా ముగించాలని తెలిపారు. గురుకుల పాఠశాలలో స్టేజి, డార్మటరీ, డైనింగ్ హాల్ పనులు పూర్తి చేసిన నేపథ్యంలో మిగిలిన మరమ్మతులు త్వరగా చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి మరమ్మతులు, అంతర్గత రహదారి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. కొత్తగా నిర్మిస్తున్న 50 పడకల ఆసుపత్రి పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-