రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

- మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ

- జకాత్, ఫిత్రా దానధర్మాలు ఆదర్శమని వ్యాఖ్య

- మైనార్టీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబాటు

హైదరాబాద్, మార్చి 20 (పీపుల్స్ మోటివేషన్): రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

రంజాన్ మాసం ఆధ్యాత్మికతకు, నియమ నిష్ఠలకు ప్రతీకగా నిలుస్తుందని సీఎం అన్నారు. ఈ నెలలో ముస్లింలు పాటించే కఠిన ఉపవాసాలు, క్రమశిక్షణతో చేసే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా రూపంలో పేదలకు సహాయం చేయడం మానవాళికి గొప్ప సందేశమని ఆయన తెలిపారు. ఈ ఆచారాలు సమాజంలో సహానుభూతి, సేవాభావాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం గంగా-జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు. అన్ని మతాలు, వర్గాలు కలిసిమెలిసి జీవించే సంస్కృతి రాష్ట్రానికి ప్రత్యేకతని ఆయన గుర్తు చేశారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సామరస్య వాతావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం అన్నారు. ప్రజలంతా పరస్పర గౌరవంతో, సహకారంతో జీవిస్తే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రంజాన్ పండుగ అందరికీ శాంతి, సుఖసంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ముగింపులో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవించాలని ప్రార్థించారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు కలగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుకున్నారు.

Comments

-Advertisement-