ఏపీలో గ్రామ పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం నిర్ణయం
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
ఏపీలో గ్రామ పంచాయతీల పునర్విభజనకు ప్రభుత్వం నిర్ణయం
- జనాభా, ఆదాయం ఆధారంగా కొత్త వర్గీకరణ
- గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3గా పంచాయతీల విభజన
- పట్టణ సదుపాయాల కోసం రూర్బన్ పంచాయతీల ఏర్పాటు
అమరావతి, 10 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల పునర్విభజన చేయాలని నిర్ణయించింది. జనాభా, ఆదాయం, భౌగోళిక విస్తీర్ణం వంటి అంశాలను ఆధారంగా తీసుకుని పంచాయతీలను పునర్‌వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు పలు గ్రామ పంచాయతీలను గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 కేటగిరీలుగా వర్గీకరించారు. ముఖ్యంగా అన్నమయ్య, అనంతపురం, అనకాపల్లి, అల్లూరి, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లోని పలు పంచాయతీలను ఈ వర్గీకరణలో చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో కూడా పట్టణాల తరహా సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా రూర్బన్ పంచాయతీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 10 వేల జనాభా ఉన్న గ్రామాలను రూర్బన్ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి కమిషనర్ తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వర్గీకరించిన గ్రామ పంచాయతీల నిధుల వినియోగం సక్రమంగా జరిగేలా సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించింది. అవసరమైన మార్పులు ఆన్‌లైన్ డేటాలో నమోదు చేయాలని ట్రెజరీ విభాగానికి కూడా ఆదేశాలు ఇచ్చింది.
Comments
