రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఇండో–అమెరికా ఒప్పందంపై నిరసన దీక్షలో మంత్రి సీతక్క

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

ఇండో–అమెరికా ఒప్పందంపై నిరసన దీక్షలో మంత్రి సీతక్క

- ఢిల్లీలో యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో ఆందోళన

- దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన ఒప్పందాలను పునఃపరిశీలించాలని డిమాండ్

- ప్రజల హక్కుల కోసం యువత పోరాటం అభినందనీయం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

న్యూఢిల్లీ, మార్చి 14 (పీపుల్స్ మోటివేషన్):
ఇండో–అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన నిరసన దీక్షలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే ఏ ఒప్పందాన్నైనా కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. భారతదేశ స్వావలంబనను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని, రైతులు, కార్మికులు మరియు సాధారణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. దేశ ప్రయోజనాలు, ప్రజల హక్కులను కాపాడే విషయంలో యువత ముందుండి పోరాడటం అభినందనీయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి పౌరుడికి తమ అభిప్రాయాలను వ్యక్తపరచే హక్కు ఉందని ఆమె తెలిపారు.

ఈ నిరసన కార్యక్రమంలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేలా ఉండాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

Comments

-Advertisement-