రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఇమ్రాన్ బాషా

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

వైయస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఇమ్రాన్ బాషా

- భూమన అభినయ్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు

- పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపు

- జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యం

తిరుపతి, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా ఇమ్రాన్ బాషా తిరుపతి వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు, యువజన విభాగం నాయకులు, 30వ వార్డు నాయకులు కూడా ఆయనతో కలిసి సమావేశమయ్యారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేయాలనే లక్ష్యంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడం అవసరమని అన్నారు. ఈ దిశగా పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలో పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు. పార్టీ విధి విధానాలకు అనుగుణంగా కృషి చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

-Advertisement-