రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

మచిలీపట్నంలో టౌన్ హాల్ ఆధునీకరణకు శ్రీకారం

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news
Mounikadesk

మచిలీపట్నంలో టౌన్ హాల్ ఆధునీకరణకు శ్రీకారం

- ఆధునిక ఫంక్షన్ హాల్‌గా అభివృద్ధి చర్యలు

- నమూనా చిత్రాలను పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర

- పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

మచిలీపట్నం, 7 మార్చి (పీపుల్స్ మోటివేషన్): మచిలీపట్నంలో ఉన్న టౌన్ హాల్‌ను ఆధునీకరించి ఆధునిక ఫంక్షన్ హాల్‌గా అభివృద్ధి చేసేందుకు మంత్రి కొల్లు రవీంద్ర చర్యలు ప్రారంభించారు. శనివారం ఉదయం 18వ డివిజన్ సచివాలయం సమీపంలోని టౌన్ హాల్‌ను పరిశీలించిన మంత్రి, మధ్య తరగతి ప్రజలు కూడా సులభంగా వినియోగించుకునే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత అభివృద్ధి పనులకు సంబంధించిన నమూనా చిత్రాలను ఎండోమెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ పి. రాధిక, ఈఓ సమ్మెట స్వామి మంత్రికి వివరించారు. భవనాన్ని ఆధునిక సదుపాయాలతో ఫంక్షన్ హాల్‌గా మార్చే ప్రణాళికపై చర్చించారు.

General News Latest news Fast telugu news Telugu short news Telugu intresting news Intresting facts Telugu daily updates Andhra Pradesh Telangana news

మంత్రి కొల్లు రవీంద్ర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మచిలీపట్నం ప్రాంత ప్రజలకు తక్కువ ఖర్చుతో ఫంక్షన్ హాల్ సదుపాయం లభిస్తుందని తెలిపారు. మధ్య తరగతి కుటుంబాలు కూడా వివాహాలు, శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.

Comments

-Advertisement-