మామిడాలపల్లిలో దేవాలయ ఉత్సవాల్లో ఈటల రాజేందర్
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
మామిడాలపల్లిలో దేవాలయ ఉత్సవాల్లో ఈటల రాజేందర్
- శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
- ద్వితీయ వార్షికోత్సవంలో పాల్గొన్న నాయకులు
- భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు
కరీంనగర్, 5 మార్చి (పీపుల్స్ మోటివేషన్): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఈటల రాజేందర్ ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలను పరిశీలించారు. ఆలయ అభివృద్ధి మరియు భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై స్థానికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, బీజేపీ నాయకులు చొప్పరి వేణు, ఎర్రబెల్లి సంపత్ రావు, పెద్ది మల్లారెడ్డి, రాజారామ్ గౌడ్, కళ్లేపు సదాశివ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవాలు ఘనంగా కొనసాగాయి.
Comments
