నంద్యాలలో దారుణ హత్య
General News
Latest news
Fast telugu news
Telugu short news
Telugu intresting news
Intresting facts
Telugu daily updates
Andhra Pradesh
Telangana news
By
Mounikadesk
నంద్యాలలో దారుణ హత్య
- ప్రియుడుతో కలిసి కుట్ర
- అదృశ్యమైన వ్యక్తి హత్యగా వెలుగులోకి
- అనైతిక సంబంధమే కారణమని వెల్లడి
- ఆధారాలు చెరిపేందుకు యాసిడ్ పోసి దహనం
నంద్యాల, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్): నంద్యాల జిల్లాలో వరుసగా జరుగుతున్న హత్యలు ప్రజల్లో భయాందోళనలకు దారితీస్తున్నాయి. తాజాగా కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. గడివేముల మండలం భోగేశ్వరం ఆలయం సమీపంలో నివసించే శ్రీనివాసులు అనే వ్యక్తి మృతి చెందిన విషయం పోలీసుల విచారణలో బయటపడింది. శ్రీనివాసులు ఆలయంలో వాచ్‌మన్‌గా పనిచేస్తుండగా, అదే ఆలయంలో టిక్కెట్ కౌంటర్‌లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లుతో ఆయన భార్య వరలక్ష్మీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఇద్దరి మధ్య అనైతిక సంబంధం కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసులు తరచూ గొడవలు పడుతూ, భార్యపై వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. మార్చి 10న మద్యం తాగి వచ్చిన శ్రీనివాసులు భార్యతో ఘర్షణకు దిగగా, వరలక్ష్మీ తోసేయడంతో ఆయన కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయే స్థితిలో ఉన్న అతన్ని చంపేందుకు వరలక్ష్మీ తన ప్రియుడు వెంకటేశ్వర్లును పిలిపించింది. ఇద్దరూ కలిసి గొంతు నులిమి హత్య చేశారు.
హత్య అనంతరం ఆనవాళ్లు లేకుండా చేయడానికి మృతదేహంపై యాసిడ్ పోసి, ఆలయం వెనుక భాగంలో కాల్చి దాచిపెట్టారు. రెండు రోజుల పాటు కనిపించకపోవడంతో శ్రీనివాసుల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. కాల్ డేటా ఆధారంగా వరలక్ష్మీపై అనుమానం రావడంతో కేసు మలుపు తిరిగింది. చివరికి వరలక్ష్మీ, వెంకటేశ్వర్లు తహశీల్దార్ ముందు లొంగిపోయి నేరాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, మృతదేహ అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనంగా మారింది.
Comments
