రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

Health tips: వేసవిలో సోంపు నీరు ఆరోగ్యానికి వరం

Health news Health tips Health updates in Telugu Health newsIndia Good health news HealthNews Daily health tips health tips in Telugu Health care news
Mounikadesk

health tips:  వేసవిలో సోంపు నీరు ఆరోగ్యానికి వరం 

  • వడదెబ్బ, డీహైడ్రేషన్‌కు సహజ రక్షణ
  • శరీరాన్ని చల్లబరచే సహజ గుణాలు
  • జీర్ణక్రియ మెరుగుపరిచే ఆయుర్వేద సూచన
  • ఖాళీ కడుపుతో తాగితే ఎక్కువ ప్రయోజనం

Health news Health tips Health updates in Telugu Health newsIndia Good health news HealthNews Daily health tips health tips in Telugu Health care news

11 మార్చి (పీపుల్స్ మోటివేషన్):
వేసవి కాలంలో వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి రక్షించుకోవడానికి చాలా మంది నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, పానీయాలను తీసుకుంటారు. సాధారణంగా కొబ్బరి నీరు, పుచ్చకాయ వంటి పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అయితే వీటితో పాటు సోంపు నీరు కూడా వేసవిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం వేసవి కాలంలో శరీరంలో పిత్త దోషం పెరుగుతుంది. దీంతో శరీరంలో వేడి, మంట, ఆమ్లత్వం వంటి సమస్యలు తలెత్తుతాయి. సోంపులో సహజంగా చల్లదనాన్ని కలిగించే గుణాలు ఉండటంతో ఇవి పిత్త దోషాన్ని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీరు తాగితే శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సోంపు నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం చల్లబడటంతో పాటు తేమ నిల్వ ఉండటానికి కూడా సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న మలినాలను బయటకు పంపే ప్రక్రియలో ఇది సహకరిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సోంపు నీరు ఉపయోగపడుతుంది. సోంపు నీరు తయారు చేయడం చాలా సులభం. ఒక టీస్పూన్ సోంపు గింజలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. కావాలంటే కొద్దిగా వేడి చేసి కూడా తాగవచ్చు. రుచికి కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలిపినా మంచిదే. మరో విధంగా సోంపు గింజలు, పటిక బెల్లం పొడి చేసి చల్లటి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

-Advertisement-