రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఫ్యాన్ కి ఓటు వేస్తే మన ఆస్తులు కోల్పోయి ఈ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాలి

Panchalingala nagaraju news Bastipadu Nagaraju news Kurnool parliament TDP Candidate Bastipati Nagaraju with senior leaders Latest tdp news in knl
Peoples Motivation

ఫ్యాన్ కి ఓటు వేస్తే మన ఆస్తులు కోల్పోయి ఈ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాలి

ఎన్నికల్లో ఓడిపోతానని జగన్ కి అర్థమైంది, తట్ఠా, బుట్ట సర్దుకుంటున్నాడు

లండన్ వెళ్లేందుకు సిబిఐ కోర్టును జగన్ అనుమతి కోరాడు

జగన్ ఇంక లండన్ కే పరిమితమవుతాడు

టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు పెట్టి సమస్యలు పరిష్కరిస్తాం

టీడీపీ ప్రభుత్వం లోనే ప్రజల ఆస్తులు సురక్షితంగా ఉంటాయి

కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు,

కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరి

Panchalingala nagaraju news Bastipadu Nagaraju news Kurnool parliament TDP Candidate Bastipati Nagaraju with senior leaders Latest tdp news in knl
కర్నూలు, మే 10 (పీపుల్స్ మోటివేషన్):-

ఎన్నికల్లో ఓడిపోతానని జగన్ కి అర్థమైందని , అందుకే తట్ఠా , బుట్ట సర్దుకుంటున్నాడని కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలోని మామిదలపాడు, మెరుగుదొడ్డి , పులకుర్తి గ్రామాల్లో కోడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్గుల దస్తగిరితో కలిసి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ పోలింగ్ తర్వాత లండన్ వెళ్లేందుకు సి.బి.ఐ కోర్టు ను జగన్ అనుమతి కోరాడని , ఎన్నికల తరువాత ఇక ఆయన లండన్ కే పరిమితమవుతారన్నారు.. ల్యాండ్ యాక్ట్ పేరు ప్రజల ఆస్తులను కాజేసేందుకు జగన్ పన్నాగం పన్నాడని, పొరపాటున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే మన ఆస్తులను కోల్పోయి ఆ ఫ్యాన్ కే ఉరి వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.. మన ఆస్తులు మన దగ్గరే సురక్షితంగా ఉండాలన్న , రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.. ఇక వైసీపీ అవినీతి పాలనలో కర్నూలు జిల్లాలోని గ్రామాలు కనీస మౌలిక సదుపాయాల కు నోచుకోక అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి, తాను ఎం.పి గా గెలిచిన తరవాత గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించి సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

Panchalingala nagaraju news Bastipadu Nagaraju news Kurnool parliament TDP Candidate Bastipati Nagaraju with senior leaders Latest tdp news in knl

Comments

-Advertisement-