రెండు తెలుగు రాష్ట్రాలలో పీపుల్స్ మోటివేషన్ తెలుగు దినపత్రికలో పనిచేయుటకు మండలాల వారీగా రిపోర్టర్లు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా స్టాపర్లు కావలెను...✍️సంప్రదించండి: 80086 22746

-Advertisement-

ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి..?

Road safety plate number Road safety in India Road safety rules Road safety poster Road safety PDF 10 importance of road safety Road safety project Ro
Peoples Motivation

ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి..?: సజ్జనార్

అతి వేగమా..!

నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా..!

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న వీడియోను షేర్ చేస్తూ..!నెటిజన్లతో పంచుకున్న టీఎస్ ఆర్టీసీ ఎండీ

 

Road safety plate number Road safety in India Road safety rules Road safety poster Road safety PDF 10 importance of road safety Road safety project Road safety Essay

హైదరాబాద్ (పీపుల్స్ మోటివేషన్):-

తెలంగాణ రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో ఓ రోడ్డు ప్రమాద వీడియోను పోస్ట్ చేశారు. అందులో ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలసి స్పోర్ట్స్ బైక్ పై అతివేగంగా దూసుకెళ్లడం కనిపించింది. కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్క నుంచి మరో ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా రోడ్డుపైకి రావడంతో రెండు బైక్ లు ఢీకొన్నాయి. వాహనాలపై ఉన్న వారంతా కిందపడిపోయారు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏమిటని సజ్జనార్ నెటిజన్లను ప్రశ్నించారు. ‘అతివేగమా, నిర్లక్ష్యంగా రోడ్డు క్రాస్ చేయడమా?’ వీటిలో దేనివల్ల రోడ్డు ప్రమాదం జరిగిందో చెప్పాలని కోరారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతోపాటు టీం రోడ్ స్క్వాడ్ ను తన పోస్ట్ కు ట్యాగ్ చేశారు. అలాగే రోడ్ యాక్సిడెంట్, రోడ్ సేఫ్టీ పేర్లతో హ్యాష్ ట్యాగ్ లను జత చేశారు. రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. ట్రాఫిక్ నిబంధనలను అనుసరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంటారు.

Comments

-Advertisement-