Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి
Road Accident: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి
- కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- ప్రమాదంలో ఆరుగురు మృతి..
- ఆరుగురు మృతిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి
Purandeswari: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి పై పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి
కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది.
ఈ సంఘటనలో చొరవ చూపిన స్థానికులకు భారతీయ జనతా పార్టీ తరపున పురంధేశ్వరి ధన్యవాదాలు తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది. అమలాపురం మండలం తాళ్ళ రేపు నుంచి చేపల వేటకు వస్తున్న వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పురంధేశ్వరి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
అలాగే, ఈ రోడ్డు ప్రమాదంపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.