Telecom: యూజర్లకు భారీ షాక్.. టెలికాం చార్జీలు పెంచేసిన నెట్వర్క్ లు..!
Telecom: యూజర్లకు భారీ షాక్.. టెలికాం చార్జీలు పెంచేసిన నెట్వర్క్ లు..!
పెరిగిన జియో రిఛార్జ్ ధరలు..
జియో దారిలోనే ఎయిర్టెల్
వొడాఫోన్ ఇండియా..
త్వరలో ఛార్జీలను పెంచే అవకాశం..
Telecom tariffs: రిలయన్స్ జియో యూజర్లు షాక్ ఇస్తూ టారిఫ్ రేట్లను పెంచింది. జూలై 3 నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వస్తాయని చెప్పింది. జియో కొత్త అపరిమిత ప్లాన్ల ప్రకటన తర్వాత ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైనట్లు సమచారం. త్వరలో ఈ రెండు టెలికాం సంస్థలు కూడా తమ టారిఫ్లను పెంచతాయని తెలుస్తోంది. త్వరలో భారతీ ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కూడా తమ మొబైల్ సర్వీస్ రేట్లను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. గురువారం జియో తన టారిఫ్ ను సవరించింది. కొత్త అపరిమిత ప్లాన్లను ప్రారంభించింది.
ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రెండూ కూడా సుస్థిర వృద్ధికి అవసరమైన టారిఫ్ల పెంపుదలని దీర్ఘకాలంగా సమర్ధిస్తున్నందున, టారిఫ్ పెంపును అనుసరించాలనే భావిస్తున్నారు. టెలికాం పరిశ్రమలో చివరిసారిగా 20 శాతం టారిఫ్ పెంపు డిసెంబర్ 2021లో జరిగింది. అంతకుముందు డిసెంబర్ 2019లో టారిఫ్లను పెంచాయి. జియో 2016లో సేవలు ప్రారంభించిన తర్వాత తొలిసారి టారిఫ్లను పెంచింది. 2019 పెంపు సుంకాన్ని 20-40% పెంచింది, 2021 పెంపు 20% పెరిగింది.“5G మరియు AI టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టడం ద్వారా పరిశ్రమ ఆవిష్కరణలు మరియు స్థిరమైన వృద్ధిని నడిపించే దిశలో కొత్త ప్లాన్ల పరిచయం ఒక అడుగు” అని జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాష్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. జియో డిసెంబర్ 2021లో ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు మొబైల్ సర్వీస్ రేట్లను పెంచింది. యిర్టెల్ ఎంట్రీ-లెవల్ మొబైల్ సేవల ప్లాన్ను 2023 ప్రారంభంలో రూ.99 నుండి రూ.155కి దాదాపు 56 శాతం పెంచింది. జియో దేశవ్యాప్తంగా 47 కోట్ల మంది మొబైల్ సబ్స్కెబర్లను కలిగి ఉంది, దాదాపు 41 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది.