UGC NET- 2024: యూజీసీ-నెట్ పరీక్ష రద్దుపై స్పందించిన కేంద్ర.. రీ ఎగ్జామ్ పై విద్యాశాఖ కీలక సమాచారం..!
UGC NET- 2024: యూజీసీ-నెట్ పరీక్ష రద్దుపై స్పందించిన కేంద్ర.. రీ ఎగ్జామ్ పై విద్యాశాఖ కీలక సమాచారం..!
యూజీసీ-నెట్ పరీక్ష రద్దుపై స్పందించిన విద్యాశాఖ
పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం
ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ వెల్లడి
యూజీసీ-నెట్ 2024 పరీక్ష రద్దు చేయబడింది. ఈ పరీక్ష రద్దుపై కేంద్ర విద్యాశాఖ స్పందించింది. యూజీసీ-నెట్ పరీక్షకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి ప్రభుత్వం పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించిందని తెలిసిందే.
యూజీసీ-నెట్ పునఃపరీక్ష ఎప్పుడు జరుగుతుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నెట్ పరీక్షను తిరిగి నిర్వహించడం గురించి విద్యా మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు మళ్లీ పరీక్ష ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకతతో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం స్వయంగా స్వీకరించి పరీక్షను రద్దు చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పరీక్ష కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
కాగా.. NEETలో అవతవకలు జరిగాయని దేశమంతటా ఆందోళనలు రేకెత్తుతున్న వేళ NTA సంచలన ప్రకటన చేసింది. మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన UGC- NET పరీక్షను రద్దు చేస్తున్నట్లు NTA ప్రకటించింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు సైబర్ క్రైమ్ విభాగానికి సమాచారం రావడం వల్ల యూజీసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను కాపాడటం కోసమే నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది.