Ravindra Jadeja: T20 కీ వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా..!
Ravindra Jadeja: T20 కీ వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా..!
టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికిన రవీంద్ర జడేజా..
విరాట్ కోహ్లి..రోహిత్శర్మ బాటలోనే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా..
విరాట్ కోహ్లి, రోహితశర్మ బాటలోనే ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా టీ20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు టీ20 ఇంటర్నేషనల్కు వీడ్కోలు పలికారు.
ఇప్పుడు ఒక్కరోజు తర్వాత జడేజా ఈ ఫార్మాట్ కు బై బై చెప్పాడు. రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో 4 లైన్ల సందేశాన్ని రాసి తన భావాలను వ్యక్తం చేశాడు. జడేజా ఇలా రాశాడు.. “నేను కృతజ్ఞతతో నిండిన హృదయంతో T20 అంతర్జాతీయ మ్యాచ్లకు వీడ్కోలు చెబుతున్నాను. దృఢమైన గుర్రం గర్వంగా దూసుకుపోతున్నట్లుగా, నేను ఎల్లప్పుడూ నా దేశం కోసం నా అత్యుత్తమమైనదాన్ని అందించాను. ఇతర ఫార్మాట్లలో కూడా అలానే కొనసాగిస్తాను. టీ20 ప్రపంచకప్న గెలవడంతో ఒక కల నిజమైంది, ఇది నా టీ20 అంతర్జాతీయ కెరీర్కు పరాకాష్ట. జ్ఞాపకాలు, ఉత్సాహం, తిరుగులేని మద్దతు కోసం ధన్యవాదాలు.” అని రవీంద్ర జడేజా పేర్కొన్నారు.